1 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు1సువార్త ప్రారంభము. 2 - ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. 3 ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము. అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు2. 4 బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. 5 అంతట యూదైయ దేశస్థులందరును యెరూషలేమువారందరును బయలుదేరి అతనియొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. 6 యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొని. మిడతలను అడవి తేనెను భక్షించువాడు. 7 మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్ప పాత్రుడను కాను; 8 నేను నీళ్లలో3మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో4మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. 9 ఆ దినములలో యేసు గలిలైయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మము పొందెను. 10 వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము తెరువబడుటయు పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. 11 మరియు -- నీవు నా ప్రియకువారుడవు; నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను. 12 వెంటనే పరశుద్ధాత్మ ఆయనను అరణ్యములోకి వెళ్లునట్లు ప్రేరేపించెను. 13 ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలుబది దినములు అడవి మృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. 14 యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు 15 --- కాలము సంపూర్ణమై యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలైయకు వచ్చెను. 16 ఆయన గలిలైయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు సముద్రములో వలవేయుట చూచెను; ఏలయనగా వారు జాలరులు. 17 యేసు -- నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. 18 వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 19 ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదై కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. 20 వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదైని జీతగాండ్రయొద్ద దోనెలో విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 21 అంతట వారు కపెర్నహూములోకి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోకి పోయి బోధించెను. 22 ఆయన శాస్త్రులవలె కాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 23 ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను. 24 వాడు -- వద్దు నజరేయుడవగు యేసూ, నీతో మాకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్దుడవు అని కేకలు వేసెను. 25-26. అందుకు యేసు - ఊరకొమ్ము, వాని విడిచిపొమ్మని దాని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. 27 అందరును విస్మయమొంది - ఇదేమిటో? యిది కొత్త బోధగా ఉన్నదే; యీయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 28 వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలైయ ప్రాంతములందంతట వ్యాపించెను. 29 అటుతరువాత వారు సమాజమందిరములోనుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. 30 సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. 31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యిపట్టి ఆమెను లేవలెత్తెను; అంతట జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. 32 సాయంకాలమున ప్రొద్దు గ్రుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టినవారిని ఆయన యొద్దకు తీసికొని వచ్చిరి; 33 పట్టణమంతయు ఇంటి వాకిట కూడియుండెను. 34 ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములన వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. 35 ఇంక చాలరాత్రియుండగా ఆయన పెందలకడనే లేచి బయలుదేరి అరణ్యప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థనచేయుచుండెను. 36 సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనకోసరము వెళ్లి 37 ఆయనను కనుగొని - అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా 38 ఆయన - నేను ఇతరమైన సమీపగ్రామములలోను ప్రకటించుటకు వెళ్లుదము రండి; యిందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. 39 ఆయన గలిలైయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్లగొట్టుచునుండెను. 40 ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని - నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. 41 ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి - నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. 42 వెంటనే కుష్ఠరోగము వాని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. 43 అప్పుడాయన - ఎవనితోను ఏమియు చెప్పకుసుమీ; 44 నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేసెను. 45 అయితే వాడు వెళ్లి అందునుగూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇకను పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలపట అరణ్యప్రదేశములలో నుండెను; నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి. Download Audio File
1 కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోకి వచ్చెను. 2 ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా 3 కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. 4 చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక ఆయనయున్నచోటికి పైగా ఇంటికప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి. 5 యేసు వారి విశ్వాసము చూచి - కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువుగలవానితో చెప్పెను. 6 శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి. 7 వారు - ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణచేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. 8 వారు తమలోతాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని - మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? 9 ఈ పక్షవాయువుగలవానితో - నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? 10 అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి 11 పక్షవాయువుగలవానిని చూచి - నీవు లేచి నీ పరుపెత్తుకొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను. 12 తత్క్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరియెదుట నడిచిపోయెను గనుక వారందరు విభ్రాంతినొంది - మనమీలాటికార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. 13 ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. 14 ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 15 అతనియింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులను పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండియుండిరి. ఇట్టివారనేకులుండిరి. వారాయనను వెంబడించువారైరి. 16 పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి - ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా 17 యేసు ఆమాట విని - రోగులకేగాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. 18 యోహోను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. కాబట్టి వారు వచ్చి - యోహాను శిష్యులును పరిశయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు; దీనికి హేతువేమని ఆయన నడుగగా 19 యేసు -పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నకాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని 20 పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలోనే వారుపవాసము చేతురు. 21 ఎవడును పాతబట్టకు కొత్తగుడ్డ మాసికను వేయడు; వేసినయెడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. 22 ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను. 23 మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచుండిరి. 24 పరిశయ్యులు - చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి. 25 అందుకాయన వారితో ఇట్లనెను - తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొనినందున దావీదుకు అవసరము వచ్చియున్నప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోకి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను. 27 మరియు - విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదనముకొరకు నియమింపబడలేదు. 28 అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువై యున్నాడని వారితో చెప్పెను. Download Audio File
1 సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. 2 అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతిదినమున వాని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. 3 ఆయన - నీవు లేచి మధ్యను నిలువమని ఊచచెయ్యిగలవానితో చెప్పి 4 వారిని చూచి - విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి. 5 ఆయన వారిహృదయకాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి - నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. 6 పరిసయ్యులు వెలుపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలిసికొని, ఆయననేలాగు సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. 7 యేసు తన శిష్యులతోకూడ సముద్రమునొద్దకు వెళ్లగా గలిలైయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. 8 మరియు ఆయన ఇంత గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదైనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమైయనుండియు, యొర్దాను అవతలనుండియు తూరు సీదోను అనెడి పట్టణప్రాంతములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. 9 జనులు గుంపుకూడగా చూచి, వారు తన్ను ఇరికింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధపరచి యుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. 10 ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైనవారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయనమీద పడుచుండిరి. 11 అపవిత్రాత్మలు (పట్టినవారు) ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి - నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. 12 ఆయన తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. 13 తరువాత ఆయన కొండెక్కి తనకిష్టమైనవారిని పిలువగా వారాయనయొద్దకు వచ్చిరి. 14-15. వారు తనతోకూడ ఉండి, దయ్యములను వెళ్లగొట్టు అధికారముగలవారై (సువార్త) ప్రకటించుటకు వారిని పంపవలెనని ఆయన పన్నెండుమందిని నియమించెను. 16 వారెవరనగా - ఆయన పేతురను పేరుపెట్టిన సీమోను 17 జెబెదై కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; వీరిద్దరికి ఆయన బోయనేర్గెసను పేర్లు పెట్టెను; బోయనేర్గెసు అనగా ఉరిమెడువారని అర్థము. 18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకొబు, తద్దయి కనానీయుడైన సీమోను, 19 ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. 20 ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరల గుంపుకూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలులేకపోయెను. 21 ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. 22 యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు - ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. 23 అప్పుడాయన వారిని తనయొద్దకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్లనెను - సాతాను సాతానునేలాగు వెళ్లగొట్టును? 24 ఒక రాజ్యము తనకుతానే విరోధముగా వేరుపడినయెడల ఆ రాజ్యము నిలువనేరదు. 25 ఒక యిల్లు తనకుతానే విరోధముగా వేరుపడినయెడల ఆ యిల్లు నిలువనేరదు. 26 సాతాను తనకుతానే విరోధముగా లేచి వేరుపడినయెడల వాడు నిలువలేక కడతీరును. 27 ఒకడు మొదట బలవంతుడైన వాని బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు; బంధించినయెడల వాని యిల్లు దోచుకొనవచ్చును. 28 సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని 29 పరిశుద్ధాత్మ విషయము దూషణచేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్యపాపము చేసినవాడైయుండుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను. 30 ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. 31 తరువాత ఆయన సహోదరులను తల్లియు వచ్చి లోపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయనచుట్టు కూర్చుండిరి. 32 వారు - ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును వెలుపల ఉండి నీకోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా 33 ఆయన - నా తల్లి నా సహోదరులు ఎవరని చెప్పి 34 తన చుట్టు కూర్చున్నవారిని కలయ చూచి- ఇదిగో నా తల్లియు నా సహోదరులును; 35 దేవుని చిత్తముచొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునై యున్నాడని చెప్పెను. Download Audio File
1 ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా బహు జనులాయనయొద్దకు కూడి వచ్చియున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుండెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి. 2 ఆయన ఉపమానరీతిగా అనేక సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. - 3 వినుడి విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 4 వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను గనుక పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. 5 కొన్ని చాలా మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని 6 సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. 7 కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. 8 కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను 9 వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను. 10 ఆయన ఒంటిగా ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులతో కూడ ఆయనుచుట్టు ఉండినవారు ఆ ఉపమానమునుగూర్చి ఆయన నడిగిరి. 11 అందుకాయన - దేవుని రాజ్యమర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని 12 వెలుపటనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయుండుటకును సమస్తము వారికి ఉపమానరీతిగా బోధింపబడుచున్నదని వారితో చెప్పెను. 13 మరియు - ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను. 14 విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. 15 త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినినవెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమెత్తికొని పోవును. 16 అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; 17 అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. 18-19. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుటవలన అది నిష్ఫలమగును. 20 మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను. 21 మరియు ఆయన వారితో ఇట్లనెను - దీపము దీపస్తంభముమీద నుంచబడుటకే గాని కుంచెముక్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదుగదా. 22 రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు. 23 వినుటకు చెవులెవనికైన యుండినయెడల వాడు వినునుగాకనెను. 24 మరియు ఆయన - మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీకు కొలువబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును. 25 కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను. 26-27. మరియు ఆయన - ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, దివారాత్రులు నిద్రపోవుచు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. 28 భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును. 29 పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని (సేద్యగాడు ) వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. 30 మరియు ఆయన ఇట్లనెను - దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? 31 అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదేగాని 32 విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను. 33 వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. 34 ఉపమానము లేక వారికి బోధింపలేదుగాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను. 35 35-36. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన- అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. 36 35-36. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన- అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను. 37 అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయనయున్న దోనెమీద కొట్టినందున దోనె నిండిపోయెను. 38 ఆయన దోనె అమరమున తలగడమీద (తలవాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి - బోధకుడా, మేము నశించిపోవుచున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి. 39 అందుకాయన లేచి గాలిని గద్దించి - నిశ్శబ్దమై ఊరకొమ్మని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. 40 అప్పుడాయన - మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను. 41 వారు మిక్కిలి భయపడి - ఈయన ఏలాటివాడో; గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. Download Audio File
1 తరువాత వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. 2 ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు గోరీలలోనుండి వచ్చి ఆయనకెదురుపడెను. 3 వాడు గోరీలలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. 4 పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి కాలిసంకెళ్లను తుత్తినియులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచ లేకపోయెను. 5 వాడు ఎల్లప్పుడును దివారాత్రులు గోరీలలోను కొండలలోను కేకలువేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. 6 వాడు దూరమునుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారముచేసి 7 - యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. 8 ఎందుకనగా ఆయన - అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. 9 మరియు ఆయన - నీ పేరేమని వాని నడుగగా వాడు - నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి 10 తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. 11 అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను 12 గనుక - ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. 13 యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తుకొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. 14 ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. 15 జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించికొని స్వచిత్తుడై కూర్చునియుండుట చూచి భయపడిరి. 16 జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా 17 తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. 18 ఆయన దోనె యెక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని 19 ఆయన వానికి సెలవియ్యక - నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నియు వారికి తెలియజెప్పుమనెను. 20 వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. 21 యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. 22 ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యయీరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదములమీద పడి 23 నా చిన్న కుమార్తె చావనైయున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా 24 ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహము ఆయనను వెంబడించి ఆయనమీద పడుచుండిరి. 25 పన్నెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి 26 తనకు కలిగినదంతయు వ్యయముచేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను. 27-28. ఆమె యేసునుగూర్చి విని- నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. 29 వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. 30 వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహము వైపు తిరిగి - నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా 31 ఆయన శిష్యులు - జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. 32 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయనచుట్టు చూచెను. 33 అప్పుడా స్త్రీ తనకు తటస్థించినది యెరిగినదై, భయపడి వణకుచువచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతియంతయు ఆయనతో చెప్పెను. 34 అందుకాయన - కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానముగలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. 35 ఆయన ఇంక మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది; నీవికను బోధకుని ఎందుకు శ్రమపెట్టుదువనిరి. 36 యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక - భయపడకుము, నమ్మికమాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి 37 పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక 38 సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు ప్రలాపించుచునుండుట చూచి 39 లోపలికిపోయి - మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. 40 అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండియున్న గదిలోకి వెళ్లి 41 ఆ చిన్నదాని చెయిపట్టి - తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము 42 వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయముగలది. అప్పుడు వారు మహా విస్మయము నొందినవారైరి. 43 జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగానాజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. Download Audio File
1 ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. 2 విశ్రాంతిదినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి - ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతులవలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి; ఇదేమి? 3 ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని చెల్లెండ్లు ఇక్కడ మనయొద్దనే యున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. 4 అందుకు యేసు - ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. 5 అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుటతప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. 6 అయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. 7 ఆయన పన్నెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారికధికారమిచ్చి 8 - ప్రయాణముకొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక 9 చెప్పులు తొడుగుకొనుడనియు, రెండంగీలు వేసికొనవద్దనియు వారికాజ్ఞాపించెను. 10 మరియు ఆయన వారితో ఇట్లనెను - మీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి. 11 ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొని మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. 12 కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు 13 దయ్యములు అనేకములు వెళ్లగొట్టుచు రోగులను అనేకులకు నూనె రాచి స్వస్థపరచుచునుండిరి. 14 ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి విని - బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియాసాధకములగుచున్నవని చెప్పెను. 15 ఇతరులు - ఈయన ఏలీయా అనియు, మరకొందరు - ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. 16 అయితే హేరోదు విని - ఇతడు నేను తలగొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని చెప్పెను. 17 హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహాను - నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయముకాదని హేరోదుతో చెప్పెను గనుక 18 ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించియుండెను. 19-20. హేరోదియ అతనిమీద పగ పట్టి అతని చంపింప నుద్దేశించెను గాని ఆమెచేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. 21. అయితే సమయోచిత దినమొకటి వచ్చెను; ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలైయదేశ ప్రముఖులకును విందు చేయించెను 21 అయితే సమయోచిత దినమొకటి వచ్చెను; ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలైయదేశ ప్రముఖులకును విందు చేయించెను. 22 అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికివచ్చి నాట్యమాడి హేరోదును అతనితోకూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజు - నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను. 23 మరియు - నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను. 24 గనుక ఆమె వెళ్లి - నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె - బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. 25 వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి - బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టి యిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. 26 రాజు బహు దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చున్నవారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. 27 వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంటును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి 28 పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను. 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి. 30 అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేసిరి. 31 అప్పుడాయన - మీరేకాంతముగా అరణ్యస్థలమునకు వచ్చి కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచునుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. 32 కాగా వారు దోనెయెక్కి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి. 33 వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణములనుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి. 34 గనుక యేసు వచ్చి విస్తారమైన ఆ జనసమూహమును చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. 35 చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి - ఇది అరణ్యప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది; 36 చుట్టుపట్ల గ్రామములకు వారు వెళ్లి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి. 37 అందుకాయన - మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు - మేము వెళ్లి యిన్నూరు దేనారములరొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి. 38 38-39. అందుకాయన - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని - అయిదు రొట్టెలును రెండు చేపలునున్నవనిరి. అప్పుడాయన - పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా 39 38-39. అందుకాయన - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని - అయిదు రొట్టెలును రెండు చేపలునున్నవనిరి. అప్పుడాయన - పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా 40 వారు నూరేసిమంది చొప్పునను ఏబదేసిమందిచొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. 41 అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచి పెట్టించెను. 42-43. వారందరు తిని తృప్తిపొందినతరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పన్నెండు గంపెళ్లు ఎత్తిరి. 44 ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు. 45 వెంటనే ఆయన జనసమూహమును పంపివేయునంతలో తన శిష్యులను దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన బలవంతము చేసెను. 46 ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకై కొండకు వెళ్లెను. 47 సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను గాని ఆయన ఒంటిగా మెట్టననుండెను. 48 అప్పుడు గాలి వారికి ఎదురైనందున దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఇంచుమించు రాత్రి నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను. 49 ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలువేసిరి. 50 అందరు ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి - ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని చెప్పెను. 51 తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను; అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతినొందిరి; 52 అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు. 53 వారు అవతలకు దాటి గెన్నేసరెతుదగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. 54 వారు దోనె దిగగానే జనులు ఆయనను గురుతుపట్టి 55 ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటుకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలు పెట్టిరి. 56 గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడివారు రోగులను సంతవీధులలో ఉంచి, వారు ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయను వేడుకొనిరి; ఆయనను ముట్టినవారందరు స్వస్థతనొందిరి. Download Audio File
1 యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి 2 ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. 3 పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. 4 మరియు వారు సంతనుండి వచ్చునప్పుడు స్నానము చేసితేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలనునీళ్లలో కడుగుటమొదలగు అనేకాచారములను వారనుసరించుకొనినవారు. 5 అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును - నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయననడిగిరి. 6 అందుకాయన వారితో ఈలాగు చెప్పెను -ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. 7 వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయాప్రవచించినది సరియే. 8 మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. 9 మరియు ఆయన - మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకై దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. 10 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. 11-12. అయినను మీరు - ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి- నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక 13 మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. 14 అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి -మీరందరు నా మాట విని గ్రహించుడి. 15 మనుష్యుని వెలుపటనుండి లోపలికి పోయి వానిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదుగాని లోపటనుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 16 *మనుష్యుని వెలుపటనుండి లోపలికి పోయి వానిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదుగాని లోపటనుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 17 ఆయన జనసమూహమును విడిచి యింటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమునుగూర్చి ఆయన నడుగగా 18 ఆయన వారితో ఇట్లనెను - మీరు ఇంత అవివేకులైయున్నారా? వెలుపటనుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? 19 అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును. 20 మనుష్యుని లోపటనుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును. 21 లోపటనుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును 22 నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమునుదేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. 23 ఈ చెడ్డవన్నియ లోపటనుండియే బయలు వెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. 24 ఆయన అక్కడనుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండలేక పోయెను. 25 అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వచ్చి ఆయన పాదములమీద పడెను. 26 ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన హెల్లేనీయురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను. 27 ఆయన ఆమెను చూచి - పిల్లలు మొదట తృప్తిపొందవలెను; పిల్లల భోజనము తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను. 28 అందుకామె - నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు సహితము బల్లక్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. 29 అందుకాయన - ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను. 30 ఆమె యింటికి వచ్చి తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను. 31 ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలైయ సముద్రమునొద్దకు వచ్చెను. 32 అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి వానిమీద చెయ్యియుంచుమని ఆయనను వేడుకొనిరి. 33 ఆయన సమూహములోనుండి వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి, వాని చెవులలో తన వేళ్లుపెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి 34 ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి - ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము. 35 అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలెను గనుక వాడు తేటగా మాటలాడెను. 36 అప్పుడాయన - ఇది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారికాజ్ఞాపించిన కొలదీ వారు మరి ఎక్కువగా దాని ప్రసిద్ధిచేయుచు 37 ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లు గాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. Download Audio File
1 ఆ దినములలో మరియొక సారి బహు జనులు కూడిరాగా వారికి తిననేమియు లేనందున యేసు తన శిష్యులను తనయొద్దకు పిలిచి 2 - జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్దనున్నారు; వారికి భోజనమునకు ఏమియులేనందున నేను వారిమీద కనికరపడుచున్నాను; 3 నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసినయెడల మార్గములో మూర్ఛపోవుదురు; వారిలో కొందరు దూరమునుండి వచ్చియున్నారని వారితో చెప్పెను. 4 అందుకాయన శిష్యులు - ఈ అరణ్యప్రదేశములో ఒకడెక్కడనుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన నడిగిరి. 5 ఆయన - మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారు- ఏడనిరి. 6 అప్పుడాయన - నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞపించి ఆ యేడు రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. 7 కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటినికూడ వడ్డించుడని చెప్పెను. 8 వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. 9 (భోజనము చేసిన) వారు ఇంచుమించు నాలుగు వేలమంది యుండిరి వారిని పంపివేసినవెంటనే 10 ఆయన తన శిష్యులతోకూడ దోనె యెక్కి దల్మనూతా ప్రాంతములకు వచ్చెను. 11 అంతట పరిశయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశములోనుండి యొక సూచకక్రియను చూపుమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి. 12 ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి - ఈ తరమువారు ఎందుకు సూచకక్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచకక్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి 13 వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను. 14 వారు భోజనమునకు ఏమైన తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియునుండలేదు. 15 ఆయన - చూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండినిగూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్తపడుడని వారిని హెచ్చరింపగా 16 వారు - తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి. 17 యేసు అది యెరిగి - మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను వివేచింపలేదా, గ్రహింపలేదా? మీరు కఠినమనస్సుగలవారై యున్నారా? 18 మీకు కన్నులు కలిగియు చూడరా? చెవులు కలిగియు వినరా?1జ్ఞాపకము చేసికొనరా? 19 నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారినడిగెను వారు - పన్నెండని ఆయనతో చెప్పిరి. 20 ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు - ఏడనిరి. 21 అందుకాయన - మీరింకను గ్రహింపకున్నారేమని చెప్పెను. 22 అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి అప్పుడు అక్కడివారు ఆయనయొద్దకు ఒక గుడ్డివాని తోడుకొనివచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. 23 ఆయన ఆ గుడ్డివాని చెయ్యిపట్టి ఊరివెలపలికి వాని తోడుకొనిపోయి వాని కన్నులమీద ఉమ్మివేసి వానిమీద చేతులుంచి - నీ కేమైనను కనబడుచున్నదా అని వానినడుగగా, 24 వాడు కన్నులెత్తి - మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. 25 అంతట ఆయన మరల తన చేతులు వాని కన్నులమీద నుంచగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. 26 అప్పుడు యేసు - నీవు ఊరిలోకి వెళ్లవద్దని చెప్పి వాని యింటికి వానిని పంపివేసెను. 27 యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరెను మార్గములోనుండగా - నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులనడిగెను. 28 అందుకు వారు - కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియయ, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. 29 అందుకాయన - మీరైతే నేను ఎవడనని చెప్పుచున్నారని వారినడుగగా పేతురు - నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. 30 అప్పుడు తన్నుగూర్చిన యీ సంగతి ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. 31 మరియు మనుష్య కుమారుడు అనేక హింసలుపొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి చంపబడి, మూడు దినములైన తరువాత లేవవలెనని ఆయన వారికి బోధింపనారంభించెను. 32 ఆయన ఈ మాట స్పష్టముగా చెప్పెను గనుక పేతురు ఆయనను చేతపట్టుకొని ఆయనను గద్దింపసాగెను. 33 అందుకాయన తన శిష్యులవైపు తిరిగి, వారిని చూచి - సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. 34 అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తనయొద్దకు పిలిచి - నన్ను వెంబడింపగోరువాడు తన్నుతానే ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. 35 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. 36 ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాని కేమి ప్రయోజనము? 37 మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? 38 వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నామాటలనుగూర్చియు సిగ్గుపడు వాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను. Download Audio File
1 మరియు ఆయన - ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు పర్యంతము మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. 2 ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి వారియెదుట రూపాంతరము పొందెను. 3 అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలివాడును అంత తెల్లగా చలువచేయలేడు. 4 మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. 5 అప్పుడు పేతురు - బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలీయాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను; 6 వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. 7 మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా - ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను 8 వెంటనే వారు చుట్టు చూచినప్పుడు తమయొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. 9 వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా - మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. 10 మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. 11 పిమ్మట వారు - ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి. 12 అందుకాయన - ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి? 13 ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడినప్రకారము వారు తమకిష్టమువచ్చినట్టుగా అతనికి చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 14 వారు ఆయన శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. 15 వెంటనే జనులందరు ఆయనను చూచి మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తుకొనివచ్చి ఆయనకు వందనము చేసిరి. 16 అప్పుడాయన - మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారినడుగగా 17 జనసమూహములో ఒకడు- బోధకుడా, మూగదయ్యముపట్టిన నా కమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని; 18 అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దాని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారివలన కాలేదని ఆయనతో చెప్పెను. 19 అందుకాయన -విశ్వాసములేని తరమువారలారా, నేను మీతో ఎంతకాలముందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వాని నాయొద్దకు తీసికొనిరండని వారితో చెప్పగా 20 వారాయనయొద్దకు వాని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. 21 అప్పుడాయన - ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు - బాల్యమునుండియే; 22 అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. 23 అందుకు యేసు-(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను. 24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి - నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమనిబిగ్గరగా చెప్పెను. 25 జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొని వచ్చుట యేసు చూచి- మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపొమ్మ, ఇకను వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. 26 అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు - వాడు చనిపోయెననిరి. 27 అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. 28 ఆయన ఇంటిలోకి వెళ్లిన తరువాత వారు ఏకాంతమున ఉండగా ఆయన శిష్యులు - మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఆయన నడిగిరి. 29 అందు కాయన - ప్రార్థన వలననేగాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. 30 వారక్కడనుండి బయలుదేరి గలిలైయ మార్గమున వెళ్లుచుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేకపోయెను; 31 ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు - మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన లేచునని వారితో చెప్పెను. 32 వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ వెరచిరి. 33 అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు - ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక 34 ఆయన ఇంట ఉన్నప్పుడు - మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిగూర్చి తర్కించుచుంటిరని వారినడుగగా 35 వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పన్నెండుమందిని పిలిచి - ఎవడైనను మొదటవాడైయుండ గోరినయెడల వాడందరిలో కడపటివాడును అందరికి పరచారకుడై యుండవలెనని చెప్పి 36 యొక చిన్న పల్లను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగలించుకొని 37 - ఇట్టి చిన్న పిల్లలలో ఒకని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను కాక నన్ను పంపినవానిని చేర్చుకొనునని వారితో చెప్పెను. 38 అంతట యోహాను - బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. 39 అందుకు యేసు -వానిని ఆటంకపరచకుడి; నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు; 40 మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. 41 మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 42 నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. 43 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుటకంటె అంగహీనుడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. 44 *నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుటకంటె అంగహీనుడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. 45 నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. 46 *నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు. 47 నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని తీసి పారవేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. 48 నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు. 49 ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును. 50 ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైనయెడల దేనివలన దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. Download Audio File
1 ఆయన అక్కడనుండి లేచి యూదైయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుకచొప్పున వారికి మరల బోధించుచుండెను. 2 ఆ సమయమున పరిశయ్యులు ఆయనయొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై - పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన నడిగిరి. 3 అందుకాయన - మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారినడిగెను. 4 వారు - పరిత్యాగపత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా 5 యేసు - మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసియిచ్చెను గాని 6 సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను 7 ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును; 8 వారిద్దరు ఏక శరీరమైయుందురు గనుక వారికను ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు. 9 కాబట్టి దేవుడు జతపరచినదానిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. 10 ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి. 11 అందుకాయన - తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడు. 12 మరియు స్త్రీ తన పురుషుని విడిచి మరియొకని పెండ్లిచేసికొనినయెడల ఆమె వ్యభిచారము చేయునదవునని వారితో చెప్పెను. 13 ఆ సమయమున తమ చిన్నపిల్లలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొనివచ్చిన) వారిని గద్దించిరి. 14 యేసు అది చూచి కోపపడి - చిన్న పిల్లలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే. 15 చిన్న పిల్లవలె దేవుని రాజ్యము నంగీకరింపనివాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననిచెప్పి 16 ఆ పిల్లలను ఎత్తి కౌగలించుకొని వారిమీద చేతులుంచి ఆశీర్వదించెను. 17 ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని - సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను. 18 యేసు - నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురషుడు కాడు. 19 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్షము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను. 20 అందుకతడు - బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను. 21 యేసు అతని చూచి అతని ప్రేమించి - నీకు ఒకటి కొదువగా నున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. 22 అతడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్లిపోయెను. 23 అప్పుడు యేసు చుట్టు చూచి - ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. 24 ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను - పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము; 25 దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. 26 అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి - అట్లయితే ఎవడు రక్షణపొందగలడని ఆయన నడిగిరి. 27 యేసు వారిని చూచి - ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. 28 పేతురు సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. 29 అందుకు యేసు ఇట్లనెను - నా నిమిత్తమును సువార్తనిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్లనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు 30 ఇప్పుడు ఇహమందు హింసలతోకూడ నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 31 మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. 32 వారు ప్రయాణమై యేరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన తిరిగి పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి 33 - ఇదిగో మనము యెరూషలేముకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకప్పగించెదరు. 34 వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. 35 జెబెదై కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి- బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయ గోరుచున్నామని చెప్పగా 36 ఆయన - నేను మీకేమి చేయగోరుచున్నారని వారినడిగెను. 37 వారు - నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి. 38 యేసు - మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా అని వారి నడుగగా వారు - మాచేత అగుననిరి. 39 అప్పుడు యేసు - నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని 40 నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరుకునని) వారితో చెప్పెను. 41 తక్కిన పదిమంది శిష్యులు ఆ మాట విని యూకోబు యోహానులమీద కోపపడసాగిరి. 42 యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను - అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద కఠిన ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద కఠినముగా అధికారము చేయుదురని మీకు తెలియును. 43 మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరచారము చేయువాడై యుండవలెను. 44 మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల వాడు అందరికి దాసుడై యుండవలెను. 45 మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెననెను. 46 వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయియను గుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను. 47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని - దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని చెప్పి కేకలువేయ మొదలుపెట్టెను. 48 ఊరకొమ్మని అనేకులు వాని గద్దించిరి గాని వాడు - దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను. 49 అప్పుడు యేసు నిలిచి - వాని పిలువుడని చెప్పగా వారా గుడ్డివాని పిలిచి - ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. 50 అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. 51 యేసు - నేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా ఆ గుడ్డివాడు - బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను. 52 అందుకు యేసు - నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు దృష్టిగలవాడై త్రోవను ఆయనవెంట వెళ్లెను. Download Audio File
1 వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి 2 - మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిదెపిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు; దానివిప్పి తోలుకొనిరండి. 3 ఎవడైనను - మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల - అది ప్రభువుకు కావలసియున్నదని చెప్పుడి. తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలనంపునని చెప్పి వారిని పంపెను. 4-5. వారు పోగా వీధిలో ఇంటికి బయట తలవాకిట కట్టబడియున్న గాడిదెపిల్ల యొకటి వారికి కనబడెను; దాని విప్పుచుండగా అక్కడ నిలిచియున్నవారిలో కొందరు - మీరేమి చేయుచున్నారు; గాడిదెపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగెను. 6 అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. 7 వారు ఆ గాడిదెపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిమీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. 8 అనేకులు తమ బట్టలను దారిపొడుగున పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. 9 మరియు ముందు నడుచుచుండువారును వెనుక వచ్చుచుండువారును - జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక 10 వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాకసర్వోన్నతమైన స్థలములలో జయము1 అని కేకలువేయుచుండిరి. 11 ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పన్నెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను. 12 మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని 13 ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరమునుండి చూచి, దానిమీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు. 14 అందుకాయన - ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి. 15 వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయవిక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి 16 దేవాలయముగుండ ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. 17 మరియు ఆయన బోధించుచు- నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడునుఅని వ్రాయబడలేదా?అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. 18 శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. 19 సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. 20 ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి. 21 అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని - బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. 22 అందుకు యేసు వారితో ఇట్లనెను - మీరు దేవునియందు విశ్వాసముంచుడి. 23 ఎవడైనను ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 24 అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 25 మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న పక్షమందు, మీరు నిలువబడి ప్రార్థనచేయునప్పుడెల్ల వాని క్షమించుడి. 26 అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. 27 వారు యెరూషలేముకు తిరిగి వచ్చినతరువాత ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకు వచ్చి 28 - ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకై యీ అధికార మెవడు నీకిచ్చెనని అడిగిరి. 29 అందుకు యేసు - నేను మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. 30 యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యలనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. 31-33. అందుకు వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల ఆయన - ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యునివలన కలిగినదని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్తయని యెంచిరి గనుక ప్రజలకు భయపడి - ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు -ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను. Download Audio File
1 ఆయన ఉపమానరీతిగా వారికి బోధింపనారంభించెను; ఎట్లనగా - ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి దానిచుట్టు కంచె వేయించి ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరముపోయెను. 2 పంటకాలమందు ఆ కాపులచేత ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు కాపులయొద్దకు అతడు ఒక దాసుని పంపగా 3 వారు వాని పట్టుకొని కొట్టి యేమియు ఇయ్యక పంపివేసిరి. 4 మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి. 5 అతడు మరియొకని పంపగా వాని చంపిరి. అతడింక అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి. 6 ఇంక అతనికి ప్రియకుమారుడు ఒకడుండెను గనుక - వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారియొద్దకు అతని పంపెను. 7 అయితే ఆ కాపులు - ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని 8 అతని పట్టుకొని చంపి ద్రాక్షతోట వెలుపల పారవేసిరి. 9 కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చునుగదా. మరియు 10 - ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయిమూలకు తలరాయి ఆయెను 11 ఇది ప్రభువువలననే కలిగెనుఇది మన కన్నులకు ఆశ్యర్యముఅను లేఖనము మీరు చదువలేదా అని అడుగగా 12 వారు తమ్మునుగూర్చి ఆ ఉపమానము చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. 13 తరువాత వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయనయొద్దకు పంపిరి. 14 వారు వచ్చి - బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మేమెరుగుదుము; నీవు మోమాటములేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట ధర్మమా కాదా? 15 ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి - మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారమునాయొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. 16 వారు తెచ్చి చూపగా ఆయన - ఈ రూపమును పై వ్రాతయు ఎవనివని వారి నడుగగా వారు - కైసరువి అనిరి. 17 అందుకు యేసు - కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. 18 తరువాత పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయనయొద్దకువచ్చి 19 - బోధకుడా, తన భార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలులేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునుకి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. 20 ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒకస్త్రీని పెండ్లిచేసుకొని సంతానములేకయే చనిపొయెను 21 గనుక రెండవవాడు ఆమెను పెండ్లిచేసుకొనెను; వాడును సంతానములేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. 22 ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను. 23 పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికి భార్య ఆయెను గదా అని అడిగిరి. 24 అందుకు యేసు - మీరు లేఖనములను దేవుని శక్తిని యెరుగక యుండుటవలననే పొరబడుచున్నారు. 25 వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లికియ్యరు పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతవలె నుందురు. 26 వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంధమందలి పొద భాగములో మీరు చుదవలేదా? అందులో దేవుడు - నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. 27 ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. 28 శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి - ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను. 29 అందుకు యేసు - ప్రధానమైనది ఏదనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. 30 నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణవివేకముతోను నీ పూర్ణబలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననుది ప్రధానమైన ఆజ్ఞ. 31 రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెననునదియే. 3వీటన్నిటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను. 32 ఆ శాస్త్రి - బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. 33 పూర్ణహృదయముతోను పూర్ణవివేకముతోను పూర్ణబలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను. 34 అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి - నీవు దేవుని రాజ్యమునకు దూరస్థుడవు కావని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు. 35 ఒకప్పుడు యేసు దేవాలయమలో బోధించుచుండగా - క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? 36 నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువతో చెప్పెనుఅని దావీదే పరశుద్ధాత్మవలన చెప్పెను. 37 దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. 38 మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను - శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను 39 సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరువారై 40 విధవరాండ్ల యిండ్లు దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్షావిధి పొందుదురనెను. 41 ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. 42-43. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి - కానుక పెట్టలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 44 వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను. Download Audio File
1 ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడు - బోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను. 2 అందుకు యేసు - ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; పడద్రోయబడక రాతి మీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండదని అతనితో చెప్పెను. 3 ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి 4 ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరుబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా 5 యేసు వారితో ఇట్లు చెప్పసాగెను - ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి. 6 అనేకులు నా పేరట వచ్చి - నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. 7 మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. 8 జనముమీదికి జనము రాజ్యముమీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. 9 మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభలకప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్షార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు. 10 సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. 11 వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు - ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి; ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. 12 సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రులమీద లేచి వారిని చంపింతురు; 13 నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషించబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును. 14 మరియు నాశనకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు - చదువు వాడు గ్రహించుగాక - యూదైయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; 15 ఇంటి మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; 16 పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోకి తిరిగి రాకూడదు. 17 అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. 18 అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. 19 అవి శ్రమగల దినములు; దేవుడు సృష్టించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు; ఇక ఎన్నడును కలుగబోదు. 20 ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించుకొనకపోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనినవారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను. 21 ఆ కాలమందు - అబద్ధ క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగుపరచెదరు. 22 కాగా - ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని యెవడైనను మీతో చెప్పిన యెడల నమ్మకుడి. 23 మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను. 24 ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, నక్షత్రములు ఆకాశమునుండి రాలును, 25 ఆకాశమందలి శక్తులు కదలింపబడును. 26 అప్పుడు మనష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. 27 అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగుచేయించును. 28 అంజూరపుచెట్టును చూచి యొక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపమైనదని మీకు తెలియును గదా. 29 ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపమై ద్వారమునొద్ద ఉన్నాడని తెలిసికొనుడి. 30 ఇవన్నియు జరుగుపర్యంతము ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 31 ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలు గతింపవు. 32 ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రిమాత్రమే తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. 33 జాగ్రత్తపడుడి; మెళకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. 34 ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి - మెళుకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును. ) 35 ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు. 36 ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెళుకువగా నుండుడి. 37 నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెళకువగా నుండుడనెను. Download Audio File
1 రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయననేలాగు పట్టుకొని చంపుదుమని ఆలోచించుకొనుచుండిరి గాని 2 ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. 3 ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుగల శిలాభరణి తీసుకొని వచ్చి, ఆ శిలాభరణి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను. 4 అయితే కొందరు కోపపడి - ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల? 5 ఈ అత్తరు మున్నూరు దేనారములకంటె ఎక్కువ వెలకమ్మి బీదలకియ్యవచ్చునని చెప్పి ఆ మెనుగూర్చి సణుగుకొనిరి. 6 అందుకు యేసు ఇట్లనెను - ఈమె జోలికి పోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నా యెడల మంచికార్యము చేసెను. 7 బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీ కిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయవచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను. 8 ఈమె తన శక్తికొలది చేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. 9 సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 10 పన్నెండుమందిలో ఇస్కరియోతు యూదా అను ఒకడు ప్రధానయాజకులచేతికి ఆయనను అప్పగింపవలెనని వారియొద్దకు పొగా 11 వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. 12 పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించునప్పుడు ఆయన శిష్యులు - నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచ గోరుచున్నావని ఆయన నడుగగా 13 ఆయన - మీరు పట్టణములోకి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; 14 వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి - నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి. 15 అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. 16 శిష్యులు వెళ్లి పట్టణములోకి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. 17 సాయంకాలమైనప్పుడు ఆయన తన పన్నెండుమంది శిష్యులతో కూడ వచ్చెను. 18 వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు - మీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా 19 వారు దుఃఖపడి - నేనే అని యొకని తరువాత ఒకడు ఆయననడుగసాగిరి. 20 అందుకాయన - పన్నెండుమందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచువాడే. 21 నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టకుండిన వానికి మేలనెను. 22 వారు భోజనము చేయుచుండగా ఆయన యొక రొట్టెను ఎత్తుకొని, ఆశీర్వదించి విరిచి వారికిచ్చి - మీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను. 23 పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి. 24 అప్పుడాయన - ఇది నిబంధనవిషయమైఅనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. 25 నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినమువరకు ఇకను దాని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 26 అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి. 27 అప్పుడు యేసు వారిని చూచి - మీరందరు అభ్యంతరపడెదరు;గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవునుఅని వ్రాయబడియున్నది గదా. 2 28 అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలైయలోకి వెళ్లెదననెను. 29 అందుకు పేతురు - అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా 30 యేసు అతని చూచి - నేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 31 అతడు మరి ఖండితముగా - నేను నీతోకూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి. 32 వారు గెత్సమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన - నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి 33 పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. 34 అప్పుడాయన - నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెళకువగా నుండుడని వారితో చెప్పి 35 కొంతదూరము సాగిపోయి నేలమీద పడి సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు 36 - నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నా యొద్దనుండి తీసివేయుము; అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను. 37 మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి - సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా? 38 మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెళుకువగానుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి 39 తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. 40 ఆయన తిరిగివచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచలేదు. 41 ఆయన మూడవ సారి వచ్చి - మీరికను నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; 42 లెండి పోదము; ఇదిగో నన్ను అప్పగించువాడు వచ్చియున్నాడని చెప్పెను. 43 వెంటనే, ఆయన ఇంక మాటలాడుచుండగా పన్నెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకుల యొద్దనుంచియు శాస్త్రులయొద్దనుంచియు పెద్దలయొద్దనుంచియు వచ్చిరి. 44 ఆయనను అప్పగించువాడు - నేనెవని ముద్దుపెట్టుకొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను. 45 వాడు వచ్చి వెంటనే ఆయనయొద్దకు పోయి - బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా 46 వారు బలాత్కారముగా ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి. 47 దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. 48 అందుకు యేసు - మీరు బందిపొటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? 49 నేను ప్రతి దినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను) 50 అప్పడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి. 51 తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా వారతని పట్టుకొనిరి. 52 అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. 53 వారు యేసును ప్రధానయాజకునియొద్దకు తీసికొనిపోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి. 54 పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయనవెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలికాచుకొనుచుండెను. 55 ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదికిరిగాని యేమియు వారికి దొరకలేదు. 56 అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదాని ఒకటి సరిపడలేదు. 57-59. అప్పుడు కొందరు లేచి - చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతిపనికాక మరియొక దేవాలయమును నేను కట్టుదునని ఇతడు చెప్పుచుండగా వింటిమని ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. 60 ప్రధానయాజకుడు వారిమధ్యను లేచి నిలిచి - ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీమీద పలుకుచున్న ఉత్తరమేమని యేసు నడిగెను. 61 అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధానయాజకుడు - శ్రీ భగవంతుని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయననడుగగా 62 యేసు - అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. 63 ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని - మనకు ఇక సాక్షులతో పని ఏమి? 64 ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరు - మరణమునకు పాత్రుడని ఆయనకు నేరస్థాపన చేసిరి. 65 కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి ఆయనను గుద్దుచు - ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. 66 పేతురు ముంగిట క్రిందిభాగములో ఉండగా ప్రధానయాజకుని పనికత్తెలలో ఒకతెవచ్చి 67 పేతురు చలికాచుకొనుచుండుట చూచెను; అతని నిదానించి చూచి - నీవును నజరేయుడవగు ఆ యేసుతోకూడ ఉండినవాడవు కావా అనెను. 68 అందుకతడు - ఆయన ఎవడో నేనెరుగను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోకి వెళ్లెను; అంతట కోడి కూసెను. 69 ఆ పనికత్తె అతని చూచి - వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్నవారితో మరల చెప్పసాగెను. 70 కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచి- నిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలైయుడవు గదా అనిరి. 71 అందుకతడు - మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. 72 వెంటనే రెండవమారు కోడి కూసెను గనుక - కోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. Download Audio File