1 ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచనచేసి యేసును బంధించి తీసికొనిపోయి పిలాతుకు అప్పగించిరి.
2 పిలాతు - యూదులరాజవు నీవేనా అని ఆయన నడుగగా ఆయన - నీవన్నట్టే అని అతనితో చెప్పెను.
3 ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
4 పిలాతు ఆయనను చూచి మరల - నీవు ఉత్తరమేమియు చెప్పవా? నీమీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
5 అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్ప లేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను.
6 ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు వారికి విడిపించువాడు.
7 అధికారుల నెదిరించి, కలహములో నరహత్య చేసినవారితోకూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
8 జనులు గుంపుగా కూడివచ్చి, అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా
9-10. ప్రధానయాజకులు అసూయచేత యేసును అప్పగించిరని పిలాతు తెలిసికొని - నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను.
11 అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనునట్లు ప్రధానయాజకులు వారిని ప్రేరేపించిరి.
12 అందుకు పిలాతు - ఆలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరల వారినడిగెను.
13 వారు - వానిని సిలువవేయుమని మరల కేకలు వేసిరి.
14 అందుకు పిలాతు - ఎందుకు? అతడేదుష్కార్యము చేసెనని వారి నడుగగా వారు - వానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.
15 పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి బరబ్బను విడుదలచేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయ నప్పగించెను.
16 అంతట రాణువవారు ఆయనను ప్రేతోర్యమను అధికారమందిరములోపలికి తీసికొనిపోయి, స్తోమమంతయు సమకూర్చుకొనినతరువాత
17 ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమునల్లి ఆయనకు పెట్టి
18 - యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.
19 మరియు రెల్లుతో ఆయన తలమీద కొట్టి, ఆయనమీద ఉమ్మివేసి, మోకాళ్లూని ఆయనకు నమస్కారముచేసిరి.
20 వారు ఆయనను అపహసించిన తరువాత ఆయనమీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయుటకు తీసికొనిపోయిరి.
21 ఆ సమయమున కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువమోయుటకు అతని బలవంతము చేసిరి.
22 అతడు అలెక్సంద్రుకును రూపుకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటుకు ఆయనను తీసికొని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలమని అర్థము.
23 అంతట బోళము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు.
24 వారాయనను సిలువవేసినతరువాత, ఎవనికిభాగము రావలెనో తెలిసికొనుటకై ఆయన వస్త్రములకోసరము చీట్లువేసి వాటిని పంచుకొనిరి.
25 ఆయనను సిలువవేసినప్పుడు పగలు మూడు గంటలాయెను.
26 మరియు - యూదులరాజని ఆయనమీద దోషారోపణగా పైవిలాసము వ్రాసియుంచిరి.
27. -28. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతోకూడ సిలువవేసిరి. 1
29 అప్పుడు ఆ మార్గమున వెళ్లుచున్న వారు తమ తలలూచుచు - ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా,
30 సిలువమీదనుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి.
31 అట్లు శాస్త్రులును ప్రధానయాజకులును అపహాస్యము చేయుచు - వీడితరులను రక్షించెను, తన్నుతాను రక్షించుకొనలేడు.
32 ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువమీదనుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతోకూడ సిలువవేయబడినవారు ఆయనను నిందించిరి.
33 మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను.
34 మూడు గంటలకు యేసు - ఎలోయి ఎలోయి లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను; ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము.
35 దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని - అదిగో ఏలీయాను పిలుచుచున్నాడనిరి.
36 ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి - తాళుడి; ఏలీయా వీని దింపవచ్చునేమో చూతుమనెను.
37 అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను.
38 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను.
39 ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి - నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
40 వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయ ఉండిరి.
41 ఆయన గలిలైయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన వేరు అనేక స్త్రీలును వారిలో ఉండిరి.
42 ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము
43 గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని ) యడిగెను. అతడు ఘనతవహించిన యొక సభికుడై, దేవుని రాజ్యమునకు ఎదురుచూచువాడు.
44 పిలాతు - ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తనయొద్దకు పిలిపించి - ఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.
45 శతాధిపతివలన సంగతి తెలిసికొని యోసేపుకు ఆ శవము నప్పగించెను.
46 అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి, ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను.
47 మగ్దలేనే మరియయు యోసే తల్లియైన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి.
Download Audio File

No comments:
Post a Comment