1 ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా బహు జనులాయనయొద్దకు కూడి వచ్చియున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుండెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
2 ఆయన ఉపమానరీతిగా అనేక సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను. -
3 వినుడి విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.
4 వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను గనుక పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను.
5 కొన్ని చాలా మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని
6 సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను.
7 కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.
8 కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను
9 వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
10 ఆయన ఒంటిగా ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులతో కూడ ఆయనుచుట్టు ఉండినవారు ఆ ఉపమానమునుగూర్చి ఆయన నడిగిరి.
11 అందుకాయన - దేవుని రాజ్యమర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని
12 వెలుపటనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయుండుటకును సమస్తము వారికి ఉపమానరీతిగా బోధింపబడుచున్నదని వారితో చెప్పెను.
13 మరియు - ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను.
14 విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు.
15 త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినినవెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమెత్తికొని పోవును.
16 అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు;
17 అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు.
18-19. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుటవలన అది నిష్ఫలమగును.
20 మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.
21 మరియు ఆయన వారితో ఇట్లనెను - దీపము దీపస్తంభముమీద నుంచబడుటకే గాని కుంచెముక్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదుగదా.
22 రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు.
23 వినుటకు చెవులెవనికైన యుండినయెడల వాడు వినునుగాకనెను.
24 మరియు ఆయన - మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీకు కొలువబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును.
25 కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
26-27. మరియు ఆయన - ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, దివారాత్రులు నిద్రపోవుచు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
28 భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును.
29 పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని (సేద్యగాడు ) వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను.
30 మరియు ఆయన ఇట్లనెను - దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?
31 అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదేగాని
32 విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశపక్షులు దాని నీడను నివసింపగలవనెను.
33 వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను.
34 ఉపమానము లేక వారికి బోధింపలేదుగాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను.
35 35-36. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన- అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను.
36 35-36. ఆ దినమందే సాయంకాలమైనప్పుడు ఆయన- అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను.
37 అప్పుడు పెద్ద తుఫాను రేగి అలలు ఆయనయున్న దోనెమీద కొట్టినందున దోనె నిండిపోయెను.
38 ఆయన దోనె అమరమున తలగడమీద (తలవాల్చుకొని) నిద్రించుచుండెను. వారాయనను లేపి - బోధకుడా, మేము నశించిపోవుచున్నాము; నీకు చింతలేదా? అని ఆయనతో అనిరి.
39 అందుకాయన లేచి గాలిని గద్దించి - నిశ్శబ్దమై ఊరకొమ్మని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను.
40 అప్పుడాయన - మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మికలేక యున్నారా? అని వారితో చెప్పెను.
41 వారు మిక్కిలి భయపడి - ఈయన ఏలాటివాడో; గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
Download Audio File

No comments:
Post a Comment