Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Saturday, August 10, 2013

మార్కు16వఅధ్యాయము

1-3. విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా - సమాధి ద్వారమునుండి మనకోసరము ఆ రాయి యెవడు పొర్లించునని యొకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. 
4  వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది. 
5  అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువటంగీ ధరించుకొనియున్న యొక యౌవనస్తుడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల విభ్రాంతినొందిరి. 
6  అందుకతడు - భయపడకుడి; సిలువవేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు;వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. 
7  మీరు వెళ్లి ఆయన శిష్యులను పేతురును చూచి, ఆయన మీకంటె ముందుగా గలిలైయలోకి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు చెప్పుడనెను. 
8  వారు బయటకు వచ్చి, వణకును విస్మయమును పట్టినవారై, సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్పలేదు. 
9  ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. 
10-11. ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. 
12  ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారురూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను. 
13  వారు వెళ్లి తక్కినవారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. 
14  ఇంకొక సమయమున పదకొండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచినతరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. 
15  మరియు -మీరు వెళ్లి సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. 
16  నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును. 
17  నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును;1ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు, క్రొత్తభాషలు మాటలాడుదురు, 
18  పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హానిచేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. 
19  ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. 
20  వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, జరుగుచు వచ్చిన2సూచనక్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. 
Download Audio File

No comments:

Post a Comment