1 మరియు ఆయన - ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు పర్యంతము మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను.
2 ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి వారియెదుట రూపాంతరము పొందెను.
3 అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను; లోకమందు ఏ చాకలివాడును అంత తెల్లగా చలువచేయలేడు.
4 మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి.
5 అప్పుడు పేతురు - బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది; మేము నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలీయాకు ఒకటి మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను;
6 వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.
7 మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా - ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను
8 వెంటనే వారు చుట్టు చూచినప్పుడు తమయొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
9 వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా - మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.
10 మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
11 పిమ్మట వారు - ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.
12 అందుకాయన - ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి?
13 ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడినప్రకారము వారు తమకిష్టమువచ్చినట్టుగా అతనికి చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
14 వారు ఆయన శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.
15 వెంటనే జనులందరు ఆయనను చూచి మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తుకొనివచ్చి ఆయనకు వందనము చేసిరి.
16 అప్పుడాయన - మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారినడుగగా
17 జనసమూహములో ఒకడు- బోధకుడా, మూగదయ్యముపట్టిన నా కమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;
18 అది ఎక్కడ వాని పట్టునో అక్కడ వాని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దాని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారివలన కాలేదని ఆయనతో చెప్పెను.
19 అందుకాయన -విశ్వాసములేని తరమువారలారా, నేను మీతో ఎంతకాలముందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వాని నాయొద్దకు తీసికొనిరండని వారితో చెప్పగా
20 వారాయనయొద్దకు వాని తీసికొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.
21 అప్పుడాయన - ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు - బాల్యమునుండియే;
22 అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
23 అందుకు యేసు-(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.
24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి - నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమనిబిగ్గరగా చెప్పెను.
25 జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొని వచ్చుట యేసు చూచి- మూగవైన చెవిటి దయ్యమా, వాని వదిలిపొమ్మ, ఇకను వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.
26 అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు - వాడు చనిపోయెననిరి.
27 అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను.
28 ఆయన ఇంటిలోకి వెళ్లిన తరువాత వారు ఏకాంతమున ఉండగా ఆయన శిష్యులు - మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఆయన నడిగిరి.
29 అందు కాయన - ప్రార్థన వలననేగాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
30 వారక్కడనుండి బయలుదేరి గలిలైయ మార్గమున వెళ్లుచుండిరి; అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టములేకపోయెను;
31 ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు - మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన లేచునని వారితో చెప్పెను.
32 వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ వెరచిరి.
33 అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు - ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక
34 ఆయన ఇంట ఉన్నప్పుడు - మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిగూర్చి తర్కించుచుంటిరని వారినడుగగా
35 వారు ఊరకుండిరి. అప్పుడాయన కూర్చుండి పన్నెండుమందిని పిలిచి - ఎవడైనను మొదటవాడైయుండ గోరినయెడల వాడందరిలో కడపటివాడును అందరికి పరచారకుడై యుండవలెనని చెప్పి
36 యొక చిన్న పల్లను తీసికొని వారి మధ్యను నిలువబెట్టి, వానిని ఎత్తి కౌగలించుకొని
37 - ఇట్టి చిన్న పిల్లలలో ఒకని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను కాక నన్ను పంపినవానిని చేర్చుకొనునని వారితో చెప్పెను.
38 అంతట యోహాను - బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను.
39 అందుకు యేసు -వానిని ఆటంకపరచకుడి; నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడును లేడు;
40 మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే.
41 మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
42 నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు.
43 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుటకంటె అంగహీనుడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు.
44 *నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుటకంటె అంగహీనుడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు.
45 నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు.
46 *నీ పాదము నిన్ను అభ్యంతరపరచినయెడల దాని నరికివేయుము; రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటె కుంటివాడవై (నిత్య) జీవములో ప్రవేశించుట మేలు.
47 నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని తీసి పారవేయుము; రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటె ఒంటికన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.
48 నరకమున వారి పురుగు చావదు; అగ్ని ఆరదు.
49 ప్రతివానికి ఉప్పుసారము అగ్నివలన కలుగును.
50 ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైనయెడల దేనివలన దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.
Download Audio File

No comments:
Post a Comment