1 ఆయన అక్కడనుండి లేచి యూదైయ ప్రాంతములకును యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయనయొద్దకు కూడివచ్చిరి. ఆయన తన వాడుకచొప్పున వారికి మరల బోధించుచుండెను.
2 ఆ సమయమున పరిశయ్యులు ఆయనయొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై - పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయన నడిగిరి.
3 అందుకాయన - మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారినడిగెను.
4 వారు - పరిత్యాగపత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా
5 యేసు - మీ హృదయకాఠిన్యమునుబట్టి అతడీ ఆజ్ఞను మీకు వ్రాసియిచ్చెను గాని
6 సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను
7 ఈ హేతువుచేత పురుషుడు తన తలిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును;
8 వారిద్దరు ఏక శరీరమైయుందురు గనుక వారికను ఇద్దరుగా నుండక యేకశరీరముగా నుందురు.
9 కాబట్టి దేవుడు జతపరచినదానిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను.
10 ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతినిగూర్చి ఆయనను మరల నడిగిరి.
11 అందుకాయన - తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడు.
12 మరియు స్త్రీ తన పురుషుని విడిచి మరియొకని పెండ్లిచేసికొనినయెడల ఆమె వ్యభిచారము చేయునదవునని వారితో చెప్పెను.
13 ఆ సమయమున తమ చిన్నపిల్లలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొనివచ్చిన) వారిని గద్దించిరి.
14 యేసు అది చూచి కోపపడి - చిన్న పిల్లలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవుని రాజ్యము ఈలాటివారిదే.
15 చిన్న పిల్లవలె దేవుని రాజ్యము నంగీకరింపనివాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననిచెప్పి
16 ఆ పిల్లలను ఎత్తి కౌగలించుకొని వారిమీద చేతులుంచి ఆశీర్వదించెను.
17 ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని - సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను.
18 యేసు - నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురషుడు కాడు.
19 నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధసాక్షము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియును గదా అని అతనితో చెప్పెను.
20 అందుకతడు - బోధకుడా, బాల్యమునుండి ఇవన్నియు అనుసరించుచునే యుంటినని చెప్పెను.
21 యేసు అతని చూచి అతని ప్రేమించి - నీకు ఒకటి కొదువగా నున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను.
22 అతడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్లిపోయెను.
23 అప్పుడు యేసు చుట్టు చూచి - ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను.
24 ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను - పిల్లలారా, తమ ఆస్తియందు నమ్మికయుంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము;
25 దేవుని రాజ్యములో ప్రవేశించుటకంటె ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము.
26 అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి - అట్లయితే ఎవడు రక్షణపొందగలడని ఆయన నడిగిరి.
27 యేసు వారిని చూచి - ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.
28 పేతురు సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను.
29 అందుకు యేసు ఇట్లనెను - నా నిమిత్తమును సువార్తనిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్లనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు
30 ఇప్పుడు ఇహమందు హింసలతోకూడ నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
31 మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.
32 వారు ప్రయాణమై యేరూషలేమునకు వెళ్లుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడాయన తిరిగి పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని, తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి
33 - ఇదిగో మనము యెరూషలేముకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకప్పగించెదరు.
34 వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను.
35 జెబెదై కుమారులైన యాకోబును యోహానును ఆయనయొద్దకు వచ్చి- బోధకుడా, మేము అడుగునదెల్ల నీవు మాకు చేయ గోరుచున్నామని చెప్పగా
36 ఆయన - నేను మీకేమి చేయగోరుచున్నారని వారినడిగెను.
37 వారు - నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ యెడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని చెప్పిరి.
38 యేసు - మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు; నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీచేత అగునా అని వారి నడుగగా వారు - మాచేత అగుననిరి.
39 అప్పుడు యేసు - నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు గాని
40 నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు; అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే (దొరుకునని) వారితో చెప్పెను.
41 తక్కిన పదిమంది శిష్యులు ఆ మాట విని యూకోబు యోహానులమీద కోపపడసాగిరి.
42 యేసు వారిని తనయొద్దకు పిలిచి వారితో ఇట్లనెను - అన్యజనులలో అధికారులని యెంచబడినవారు వారిమీద కఠిన ప్రభుత్వము చేయుదురు; వారిలో గొప్పవారు వారిమీద కఠినముగా అధికారము చేయుదురని మీకు తెలియును.
43 మీలో ఆలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై యుండగోరినయెడల వాడు మీకు పరచారము చేయువాడై యుండవలెను.
44 మీలో ఎవడైనను ప్రముఖుడై యుండగోరినయెడల వాడు అందరికి దాసుడై యుండవలెను.
45 మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెననెను.
46 వారు యెరికోపట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయియను గుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.
47 ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని - దావీదు కుమారుడా యేసూ, నన్ను కరుణింపుమని చెప్పి కేకలువేయ మొదలుపెట్టెను.
48 ఊరకొమ్మని అనేకులు వాని గద్దించిరి గాని వాడు - దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలువేసెను.
49 అప్పుడు యేసు నిలిచి - వాని పిలువుడని చెప్పగా వారా గుడ్డివాని పిలిచి - ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి.
50 అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను.
51 యేసు - నేను నీకేమి చేయ గోరుచున్నావని వాని నడుగగా ఆ గుడ్డివాడు - బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని ఆయనతో అనెను.
52 అందుకు యేసు - నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు దృష్టిగలవాడై త్రోవను ఆయనవెంట వెళ్లెను.
Download Audio File

No comments:
Post a Comment