1 వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి
2 - మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిదెపిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు; దానివిప్పి తోలుకొనిరండి.
3 ఎవడైనను - మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్ము నడిగినయెడల - అది ప్రభువుకు కావలసియున్నదని చెప్పుడి. తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలనంపునని చెప్పి వారిని పంపెను.
4-5. వారు పోగా వీధిలో ఇంటికి బయట తలవాకిట కట్టబడియున్న గాడిదెపిల్ల యొకటి వారికి కనబడెను; దాని విప్పుచుండగా అక్కడ నిలిచియున్నవారిలో కొందరు - మీరేమి చేయుచున్నారు; గాడిదెపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగెను.
6 అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
7 వారు ఆ గాడిదెపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిమీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను.
8 అనేకులు తమ బట్టలను దారిపొడుగున పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.
9 మరియు ముందు నడుచుచుండువారును వెనుక వచ్చుచుండువారును - జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక
10 వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాకసర్వోన్నతమైన స్థలములలో జయము1 అని కేకలువేయుచుండిరి.
11 ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాలమైనందున పన్నెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.
12 మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని
13 ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరమునుండి చూచి, దానిమీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.
14 అందుకాయన - ఇకమీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను; ఇది ఆయన శిష్యులు వినిరి.
15 వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయవిక్రయములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి
16 దేవాలయముగుండ ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను.
17 మరియు ఆయన బోధించుచు- నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడునుఅని వ్రాయబడలేదా?అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
18 శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి.
19 సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను.
20 ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి.
21 అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని - బోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.
22 అందుకు యేసు వారితో ఇట్లనెను - మీరు దేవునియందు విశ్వాసముంచుడి.
23 ఎవడైనను ఈ కొండను చూచి - నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
24 అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
25 మీకు ఒకనిమీద విరోధమేమైనను కలిగియున్న పక్షమందు, మీరు నిలువబడి ప్రార్థనచేయునప్పుడెల్ల వాని క్షమించుడి.
26 అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
27 వారు యెరూషలేముకు తిరిగి వచ్చినతరువాత ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకు వచ్చి
28 - ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకై యీ అధికార మెవడు నీకిచ్చెనని అడిగిరి.
29 అందుకు యేసు - నేను మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
30 యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యలనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.
31-33. అందుకు వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల ఆయన - ఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును; మనుష్యునివలన కలిగినదని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్తయని యెంచిరి గనుక ప్రజలకు భయపడి - ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు -ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.
Download Audio File

No comments:
Post a Comment