1 యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి
2 ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి.
3 పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు.
4 మరియు వారు సంతనుండి వచ్చునప్పుడు స్నానము చేసితేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలనునీళ్లలో కడుగుటమొదలగు అనేకాచారములను వారనుసరించుకొనినవారు.
5 అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును - నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయననడిగిరి.
6 అందుకాయన వారితో ఈలాగు చెప్పెను -ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
7 వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయాప్రవచించినది సరియే.
8 మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు.
9 మరియు ఆయన - మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకై దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.
10 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా.
11-12. అయినను మీరు - ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి- నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయనియ్యక
13 మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.
14 అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచి -మీరందరు నా మాట విని గ్రహించుడి.
15 మనుష్యుని వెలుపటనుండి లోపలికి పోయి వానిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదుగాని లోపటనుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.
16 *మనుష్యుని వెలుపటనుండి లోపలికి పోయి వానిని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదుగాని లోపటనుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను.
17 ఆయన జనసమూహమును విడిచి యింటిలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమునుగూర్చి ఆయన నడుగగా
18 ఆయన వారితో ఇట్లనెను - మీరు ఇంత అవివేకులైయున్నారా? వెలుపటనుండి మనుష్యుని లోపలికి పోవునదేదియు వాని నపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా?
19 అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును; ఇట్లు అది భోజనపదార్థములన్నిటిని పవిత్రపరచును.
20 మనుష్యుని లోపటనుండి బయలు వెళ్లునది మనుష్యుని అపవిత్రపరచును.
21 లోపటనుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును
22 నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమునుదేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును.
23 ఈ చెడ్డవన్నియ లోపటనుండియే బయలు వెళ్లి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను.
24 ఆయన అక్కడనుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి యొక ఇంట ప్రవేశించి, ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై యుండలేక పోయెను.
25 అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వచ్చి ఆయన పాదములమీద పడెను.
26 ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన హెల్లేనీయురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడుకొనెను.
27 ఆయన ఆమెను చూచి - పిల్లలు మొదట తృప్తిపొందవలెను; పిల్లల భోజనము తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను.
28 అందుకామె - నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు సహితము బల్లక్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను.
29 అందుకాయన - ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను.
30 ఆమె యింటికి వచ్చి తన కుమార్తె మంచముమీద పండుకొని యుండుటయు దయ్యము వదలిపోయి యుండుటయు చూచెను.
31 ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతములమీదుగా గలిలైయ సముద్రమునొద్దకు వచ్చెను.
32 అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయనయొద్దకు తోడుకొనివచ్చి వానిమీద చెయ్యియుంచుమని ఆయనను వేడుకొనిరి.
33 ఆయన సమూహములోనుండి వానిని ఏకాంతమునకు తోడుకొనిపోయి, వాని చెవులలో తన వేళ్లుపెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి
34 ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి - ఎప్ఫతా అని వానితో చెప్పెను; ఆ మాటకు తెరవబడుమని అర్థము.
35 అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలెను గనుక వాడు తేటగా మాటలాడెను.
36 అప్పుడాయన - ఇది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను; అయితే ఆయన చెప్పవద్దని వారికాజ్ఞాపించిన కొలదీ వారు మరి ఎక్కువగా దాని ప్రసిద్ధిచేయుచు
37 ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లు గాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి.
Download Audio File

No comments:
Post a Comment