1 తరువాత వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.
2 ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు గోరీలలోనుండి వచ్చి ఆయనకెదురుపడెను.
3 వాడు గోరీలలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను.
4 పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి కాలిసంకెళ్లను తుత్తినియులుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచ లేకపోయెను.
5 వాడు ఎల్లప్పుడును దివారాత్రులు గోరీలలోను కొండలలోను కేకలువేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను.
6 వాడు దూరమునుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారముచేసి
7 - యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.
8 ఎందుకనగా ఆయన - అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను.
9 మరియు ఆయన - నీ పేరేమని వాని నడుగగా వాడు - నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి
10 తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను.
11 అక్కడ కొండదగ్గర పందుల పెద్దమంద మేయుచుండెను
12 గనుక - ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.
13 యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తుకొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను.
14 ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి.
15 జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించికొని స్వచిత్తుడై కూర్చునియుండుట చూచి భయపడిరి.
16 జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా
17 తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.
18 ఆయన దోనె యెక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని
19 ఆయన వానికి సెలవియ్యక - నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నియు వారికి తెలియజెప్పుమనెను.
20 వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.
21 యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను.
22 ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యయీరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదములమీద పడి
23 నా చిన్న కుమార్తె చావనైయున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా
24 ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహము ఆయనను వెంబడించి ఆయనమీద పడుచుండిరి.
25 పన్నెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి
26 తనకు కలిగినదంతయు వ్యయముచేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను.
27-28. ఆమె యేసునుగూర్చి విని- నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను.
29 వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను.
30 వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహము వైపు తిరిగి - నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా
31 ఆయన శిష్యులు - జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే; నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి.
32 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయనచుట్టు చూచెను.
33 అప్పుడా స్త్రీ తనకు తటస్థించినది యెరిగినదై, భయపడి వణకుచువచ్చి ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతియంతయు ఆయనతో చెప్పెను.
34 అందుకాయన - కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానముగలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను.
35 ఆయన ఇంక మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది; నీవికను బోధకుని ఎందుకు శ్రమపెట్టుదువనిరి.
36 యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక - భయపడకుము, నమ్మికమాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి
37 పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక
38 సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు ప్రలాపించుచునుండుట చూచి
39 లోపలికిపోయి - మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను.
40 అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండియున్న గదిలోకి వెళ్లి
41 ఆ చిన్నదాని చెయిపట్టి - తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము
42 వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయముగలది. అప్పుడు వారు మహా విస్మయము నొందినవారైరి.
43 జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగానాజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.
Download Audio File

No comments:
Post a Comment